
పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
విద్యార్థులకు అర్థమయ్యేలాగా బోధించాలి
విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు : పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని,అర్ధం అయ్యే లాగా విద్యార్థులకు బోధన చేయాలని, వారికి మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల పాఠశాల తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో వారికి అందుతున్న విద్యపై విద్యార్థులచే సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు గణితం పై ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు, బోర్డు పై గణితం లెక్కలను వ్రాయించారు మరియు వారికి పరీక్షలలో వచ్చిన మార్కుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతిలో ఉన్న మీరందరూ కష్టపడి చదివి అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి అని,భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పదవుల లో పురోగతి సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉత్సాహపరిచారు.అనంతరం పాఠశాల అధ్యాపకులతో వారు అందిస్తున్న విద్యపై పలు సూచనలు చేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు సాంబారు చిక్కగా లేదని నాణ్యతగా లేదని గుర్తించి మంచి ఆహారాన్ని విద్యార్థులకు అందించ వలసిందిగా ఆదేశిస్తూ , ఇపుడు ఉన్న భోజనం నిర్వాహకులను మార్చవలసిందిగా ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు , సర్వ శిక్ష అభియాన్ ఏపీసి లోకరాజు ,ఆర్డిఓ సందీప్ కుమార్ ,వెలుదుర్తి తహసిల్దార్ వర్మ పాల్గొన్నారు.

