అప్పుడే చెలరేగిపోతున్న భానుడు..

అప్పుడే చెలరేగిపోతున్న భానుడు..

 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. మాములుగా మార్చిలో నమోదయ్యే టెంపరేచర్స్.. ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డవుతున్నాయి. ప్రస్తుతం 37 డిగ్రీల సెల్సియస్‌ను క్రాస్ అవుతోంది. ఇది సాధారణం కంటే… రెండు డిగ్రీలు ఎక్కువ అని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు చలితో అల్లాడిన జనం.. ఇప్పుడు ఉక్కుపోతతో విసిగిపోతున్నారు. ఉదయం 10 దాటితే భానుడు చెలరేగిపోతున్నాడు.

ఫిబ్రవరి ఇంకా రెండవ వారంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వారం పగటిపూట గరిష్టాలు 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రుళ్లు, ఉదయం పరిస్థితి బానే ఉన్నా.. పగలు మాత్రం భానుడు భగ భగ మండిపోతున్నాడు.

దిగువ ట్రోపోఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఫలితంగా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని, రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని అంచనా. వేడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS