
అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు,న్యూస్ వెలుగు : వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాగల 4,5 రోజుల్లో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..
ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు, రైతులు, పశువుల కాపరులు, గొర్రెలు కాపరులు సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!