అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

అమరావతి :పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు పోలీసు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోల సమస్య, హైదరాబాద్ మతకలహాలు, రాయలసీమ ముఠాలు, ఎన్నో సామాజిక సమస్యల్ని పోలీసులు పరిష్కరించారు. దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అగ్ర స్థానంలో ఉండేదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. మళ్లీ ఆ గౌరవాన్ని దక్కించుకోవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం పోలీసుల స‌రెండ‌ర్ లీవ్‌లు, జీపీఎఫ్‌, టీఏ బిల్లులు మొత్తం రూ.763 కోట్లు పెండింగ్‌ పెట్టింది.వాటిని క్లియ‌ర్ చేస్తాం. 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల‌ను నియ‌మిస్తున్నాం. పోలీసు సంక్షేమం కోసం రూ.20 కోట్లు ఇస్తామని  ఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS