అమిత్ షా అంబేద్కర్‌ను ఎగతాళి చేశారు :APPCC

అమిత్ షా అంబేద్కర్‌ను ఎగతాళి చేశారు :APPCC

అమరావతి : విజయవాడ APCC ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. అమిత్ షా అంబేద్కర్‌ను ఎగతాళి చేసే పరిష్టితికి నాయకుల ఆలోచనలు వచ్చాయని వారు అన్నారు. ఫ్యాషన్ అంటూ అవమానించడమే కాకుండా  అవహేళన చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ అంటే లెజెండ్,  అంబేద్కర్ అంటే ఐడియాలజి అని ఆమె కొనియాడారు  . ఈ విషయం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదని ,  బీజేపీ అంబేద్కర్‌కి క్షమాపణ చెప్పాలని, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  అందుకే దేశ వ్యాప్తంగా జై బాపూ, జై భీం,జై సంవిధాన్ క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు. బీజేపీ మత పిచ్చి పార్టీ మాత్రమే కాదని , బీజేపీ కుల పిచ్చి పార్టీ,  మతం పేరుతో,కులం పేరుతో ఎన్నో రాజకీయాలు చేస్తోందన్నారు. మణిపూర్, గోద్రా ఘటనలు దీనికి నిదర్శనమన్నారు. బీజేపీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతుందని అన్నారు. ఇవన్నీ చాలదు అన్నట్లు మన దేశాన్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారన్నారు . దేశ చరిత్రను మార్చాలని కుట్ర చేస్తున్నారు. స్వాతంత్య్ర యోధులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని , మహాత్మ గాంధీ గారిని విలన్‌గా క్రియేట్ చేస్తున్నారన్నారు . గాంధీ గారిని చంపిన వారిని దేవుడు అంటున్నారు. వారికి గుడులు కడుతున్నారు. గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమైన సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు. మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు. మసీదులు, చర్చిలను కూలగొడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. బీజేపీకి దళితులు అంటే చిన్నచూపు. కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు.  అంబేద్కర్‌ను అవమానిస్తే రాష్ట్రంలో పార్టీలు మౌనం వహిస్తున్నాయి. బాబు, జగన్, పవన్ లోనే బీజేపీ ఉంది. అందుకే అమిత్ షా వ్యాఖ్యలపై నోరు విప్పడం లేదు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం. రెజల్యూషన్ ప్రతినీ రాష్ట్రపతికి పంపుతాం. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, సీపీఎం నేత బాబూరావు గారు, మాజీ ఎమ్మెల్సీలు కె.లక్ష్మణ్ రావు గారు, జిల్లి విల్సన్ గారు, లా కాలేజీ ప్రిన్సిపల్ చెన్నూపాటి దివాకర్ బాబు గారు, ముస్లిం మైనార్టీ మరియు ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS