ఆందోళన చెందకండి అందరిని ఆదుకుంటాం : మంత్రి కొల్లు

ఆందోళన చెందకండి అందరిని ఆదుకుంటాం : మంత్రి కొల్లు

అమరావతి : వరద బాధితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వరద ప్రభావం క్రమంగా తగ్గుతోందని అన్ని ప్రాంతాలకు వెళ్లి ఆహారం, తాగునీరు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు.

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పాలు, బిస్కెట్లు, తాగునీరు పంపిణీ ఏర్పాట్లను మంత్రులు స్థానిక ఎంపి కేశినేని శివనాథ్ తో కలిసి పర్యవేక్షించారు. వరద ప్రభావిత జక్కంపూడి, సింగ్ నగర్ లకు ట్రాక్టర్లపై తరలించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS