ఆధార్ తరహాలో మరో కార్డు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

ఆధార్ తరహాలో మరో కార్డు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

న్యూస్ వెలుగు అమరావతి : ప్రతి వ్యక్తికి ఉండే ఆధార్ కార్డు తరహాలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో సహా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థ నిర్ణయించింది. గురువారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే ‘పాపులేషన్ పాలసీ’ రూపొందించాలని కూడా సమావేశం నిర్ణయించింది. కేవలం ప్రభుత్వ పథకాలు అందుకోవడం కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఉండరాదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS