
సర్ప―మూషిక న్యాయం..!
తెలుగు కథ
న్యూస్ వెలుగు : ఒక ముసలి పాము సమయం కలిసి రాక ఓ బుట్టలో చిక్కుకుంది.ఏం చేయాలో దిక్కుతోచక గిలగిల లాడుతున్న సమయంలో జీవన గమనంలో భాగంగా ఒక చిట్టెలుక అటుగా వెళుతూ బుట్టలో ఉన్నది నాలాంటి చిన్న ప్రాణే నేమో అయ్యో అని జాలితో తొంగి చూసే సరికి చచ్చేలా ఉన్న ఓ ముసలి పాము ప్రాణాలరచేతిలో పెట్టుకుని విలవిల లాడుతూ ఉంటుంది.
’ అని చెప్తుంది. వెను వెంటనే
ఎలుక ఇది మోసపూరిత కుట్ర పూరిత,ఎన్నో సంవత్సరాలుగా జిత్తుల మారితనం తో ఎన్నో జీవితాలను పొట్టన పెట్టుకుందని తెలియని చిట్టెలుక ,బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. ఎంతో అనుభవం ఉన్న ఆ ముసలి పాము వెనువెంటనే ఆ చిట్టెలకని ఎంచక్కా మింగేసి, తరువాత ఎలుక చేసిన ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ “సర్ప మూషిక న్యాయం” ప్రకారం పరస్పర ఆధారిత జీవులలో ఒకజీవి బ్రతుకు మీద ఆశతో భవిష్యత్తు మీద బలీయమైన ఆకాంక్షతో తన కంటే అన్నింటి లో శక్తి ఉన్న పాము కు సాయం చేసింది.ఐతే నర నరా లలో అణువణువునా కుట్రలతో మమేకమైన ముసలి పాము స్వార్థం ,వంచన తో కూడిన ప్రవర్తన తో ఆపద నుండి బయటపడి చేరుకోవాలనుకున్న ఒక స్థాయికి చేరిన తరువాత తన స్వార్ధానికి, స్వప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీఠవేసింది.
జీవరాశిలో దురదృష్టకరం ఇలాంటి బంధాలు!తల్లి లాంటి దానిని అంటూ సృష్టిలోనే పరమ పవిత్రమైన బంధాన్ని కూడా నాటకీయం చేసింది ఈ ముసలి నీచపు పాము
మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అవసరం తీరి పోయాకా వాళ్ల కి కావాల్సింది దొరికేశాకా నువ్వెవరో వాళ్లెవరో!వాళ్లకి అవసరంతో తప్ప మరెవరితోనూ పనుండదు,అవసరం ఉన్న వారు తప్ప వేరొకరు కనిపించరు. అందుకే సాయం కూడా ఆచి తూచి చేయాలి.
అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా అతి మంచితనం కూడా పనికిరాదు.స్వార్థం ఈర్ష్య అసూయ వంటి విషం నింపుకున్న మనసుతో తేనెలొలికించే మాటలతో మనచుట్టూ ఎంతో మంది ఉంటారు.జాగ్రత్తగా మసలుకోవాలి..
శత్రువును ఎదుర్కొనే శక్తి లేనప్పుడు యుక్తిని ప్రదర్శించుట ఉత్తమము.బుద్ధిని వీడకుండుట సర్వోత్తమము.
వేమన శతకం లో చదువు కున్నట్లుగా “చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా?” అన్న చందాన “చెప్పు” డు మాటలతో నాటకీయపు కన్నీటి చుక్కలతో జీవితంలో ఎదురయ్యే కొన్ని బంధాలు కూడా ఇంతే!!