ఆరు గంటల్లో కేసు నమోదు : మార్గ దర్శకాలను ఇచ్చిన ప్రభుత్వం

ఆరు గంటల్లో కేసు నమోదు : మార్గ దర్శకాలను ఇచ్చిన ప్రభుత్వం

ఢిల్లీ : వైద్యులపై హింసకు పాల్పడితే గరిష్ఠంగా ఆరు గంటల్లోగా ఇన్‌స్టిట్యూషనల్ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసే బాధ్యత ఇన్‌స్టిట్యూషన్ హెడ్‌కి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల అధిపతికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయెల్ లేఖ రాశారు. ఇటీవల కోల్‌కతాలో ఓ వైద్యురాలి పై  హత్య ఘటన, ఈ అంశంపై రెసిడెంట్ వైద్యుల నిరసన నేపథ్యంలో ఈ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై హింస సర్వసాధారణమైపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పునరావృత్తం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!