ఆలూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలి
అభివృద్ధి పనులకు భూమి పూజ
షాపింగ్ కాంప్లెక్స్, సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీరూపాక్షి
*జూనియర్ కళాశాల అకస్మిక తనిఖీ
హోళగుంద,న్యూస్:మండల కేంద్రంలో బుధవారం బిసి కాలనీకి వెళ్ళే రహదారికి రూ.5 లక్షల జడ్పీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి భూమి పూజ చేశారు.అనంతరం వైసిపి నాయకులు కురువ ఉచ్చన్న నూతన షాపింగ్ కాంప్లెక్స్ , సూపర్ మార్కెట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ముందుగా పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి,శాలువ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.తదనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇందులో భాగంగా సిఈసి మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా టాపర్ గా నిలిచిన జే.మేఘన అనే విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించి,రూ.10 వేల నగదును బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని వచ్చే సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి కళాశాలకు,హొళగుంద మండలానికి,ఆలూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పారు. మంచిగా చదువుకునే విద్యార్థులకు నేను ఎల్లప్పుడు మంచి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు.ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని ఎల్లప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీయుల్లా,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,ఎంపిపి తనయుడు ఈసా,ఎంపీటీసీ మల్లికార్జున,సర్పంచ్ తనయుడు పంపాపతి,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప, సింగిల్ విండో మాజీ చైర్మన్ మల్లికార్జున,వైస్ ఎంపిపి తనయుడు కెంచప్ప, తండా సర్పంచ్ తనయుడు రామ్ నాయక్,ఎంపీటీసీ మంజు నాయక్,వైసిపి నాయకులు గిరి,రహంతుల్లా,సోమిరెడ్డి,హాసనప్ప,రాఘవేంద్ర, గోవింద,సిద్దప్ప,వెంకటేష్, గాదిలింగ, మౌనిష్,శంభు లింగ,రవి,నందిష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.