అమరావతి : ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రతినిధులతో ఐసిఈఎ చైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షతన న్యూడిల్లీలో సమావేశమయ్యాను. ఈ సమావేశానికి వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు వివరించాను.

దేశంలో పేరెన్నిగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశామని, తరచూ వారితో సమావేశమై పరిశ్రమదారులకు ఎదురయ్యే విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తున్నామని, అన్నిరకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేశామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్ అనే నినాదంతో పనిచేస్తున్నామని వివరించాను. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడిబిని పునరుద్దరించామని, సరైన ప్రతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాను
Thanks for your feedback!