ఇంద్రకీలాద్రి పై వినాయక చవితి వేడుకలు ప్రారంభం 

ఇంద్రకీలాద్రి పై వినాయక చవితి వేడుకలు ప్రారంభం 

విజయవాడ,న్యూస్ వెలుగు :దేవస్థానంలో మూడు రోజుల పాటు అనగా తేది.07.09.2024 నుండి తేది.09.09.2024 వరకు నిర్వహించు వినాయక చవితి ఉత్సవములలో భాగముగా శనివారం రోజునశ్రీ నటరాజస్వామి వారి ఆలయములో గల శ్రీ వినాయకుని ఆలయము నందు,  చిన్న రాజగోపురము ఎదురుగా గల లక్ష్మీ గణపతి విగ్రహము వద్ద మృత్తికా గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహము వద్ద. ఉ. గం.08-00 ని.లకు వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే విఘ్నేశ్వర పూజ, అనంతరం కలశ స్థాపన, విశేష పత్రి పూజలు శాస్త్రోక్తముగా నిర్వహించగా ఆలయ పురాణ పండిట్ వారిచే వినాయక చవితి కథాశ్రవణంనిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!