
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్
డిల్లీ ,న్యూస్ వెలుగు:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ ర్యాంకింగ్‌లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రాష్ట్రాలలో వ్యాపారాన్ని సులభతరం చేయడం, ప్రోత్సహించడంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిఆర్‌ఎపి)ా22 తెలిపింది. ఆ తరువాత స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ , త్రిపుర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలోని తొమ్మిది సూచీల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఐదు సూచీల్లోనూ, గుజరాత్ మూడు సూచీల్లోనూ ముందున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, పుదుచ్చేరి ర్యాంకింగ్‌లో బాగా వెనుకబడ్డాయి. న్యూఢిల్లీలో కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బిఆర్‌ఎపిా22 అవార్డును కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ దేశ ప్రగతికి ఆరోగ్యకరమైన పోటీ, సహకారం కీలకమని అన్నారు. ప్రతి రాష్ట్రం పరిశ్రమ విధానాలను అధ్యయనం చేయాలని, తమను తాము మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist