
ఉత్తమ ఉపాధ్యాయ గురువులకు ఘన సన్మానం
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;గురుపూజోత్సవం నాడు గురువులను, పెద్దలను గౌరవించడం, ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని పెద్దముడియం మండల విద్యాశాఖ అధికారులు చింతకాయల చౌడయ్య, శివ జ్యోతిలు పేర్కొన్నారు. గురువారం పెద్దముడియం మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల పరిధిలోని ఆయా పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను గురు పూజోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. అలాగే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులను,ఉపాధ్యాయులను పలువురు గురువులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్. ఎం. వి.బాల నరసింహులు, రిటైర్డ్ టీచర్ టీవీ సుబ్రహ్మణ్యం శెట్టిలను మండలంలోని పలు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ హెడ్ టీచర్ జయలక్ష్మి దేవి, ఎంపిపిస్కూల్ గుల్లగుంట ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం లక్ష్మీదేవి, జంగాలపల్లె ఎంపీపీ స్కూల్ హెడ్ టీచర్ శ్రీలక్ష్మి, ఎన్.కొట్టాలపల్లి ఎంపీపీ స్కూల్ హెడ్ టీచర్ కే. సి. ఓబులేసు, పెద్ద పసుపుల 10 వ వార్డు ఎంపీపీ స్కూల్ ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్ శేషాద్రిరాజు, ఎం.నాగార్జున రెడ్డి, వై.శివకుమార్ రెడ్డి, శివ రామిరెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.