
ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం కు ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు : 2024వ సం. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం కు ఎన్నికైనట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు తెలిపారు. ఈ నెల 25వ తేదీన “15వ జాతీయ ఓటర్ల దినోత్సవం” సందర్భముగా విజయవాడ నందు పురస్కారం అందుకోనున్న జిల్లా ఎస్పీ. 2024వ సం. లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన ఎన్నికల సందర్భముగా చిత్తూరు జిల్లా నందు ఎన్నికలను జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారు పారదర్శకతతో ఎన్నికలను నిర్వహించి, శాంతిభద్రతలకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించినందుకు గాను ఎస్పీ ని “ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం” కు ప్రధాన ఎన్నికల అధికారి ఎంపిక చేశారు.

Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM