ఊరు ఊరంతా మొదలైన చవితి సందడి వేడుకలు
హోళగుంద,న్యూస్ వెలుగు:దేశంలో పండుగలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.తీరిక లేకుండా పనిలోనే నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.అందులోనూ వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు.పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి.హైందవ సాంప్రదాయం ప్రకారం ఏది చేసిన ముందుగా విఘ్నేశ్వర పూజ నిర్వహిస్తారు.ఎందుకంటే జనుల విఘ్నంలను తొలగించే విఘ్నదిపతి మన లంబోదరుడు…ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి శనివారం వచ్చింది.గణేష్ చదుర్ది భాద్రపద శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు.
దేశంలో పండుగలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.తీరిక లేకుండా పనిలోనే నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా కుటుంబంతోనే ఆనందంగా గడుపుతారు.అందులోనూ వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు.పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి.హైందవ సాంప్రదాయం ప్రకారం ఏది చేసిన ముందుగా విఘ్నేశ్వర పూజ నిర్వహిస్తారు.ఎందుకంటే జనుల విఘ్నంలను తొలగించే విఘ్నదిపతి మన లంబోదరుడు…ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి శనివారం వచ్చింది.గణేష్ చదుర్ది భాద్రపద శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు.గణేష్ చదుర్థి నుంచి విఘ్నేశ్వరుడికి పూజలు మొదలవుతాయి. ప్రత్యేక పూజలు,భజనలతో భక్తి భావంతో మునిగి తెలుతారు.ఈ పూజలు మూడు రోజుల వరకు ఎవరి శక్తిమేరకు ఉత్సవాన్ని జరుపుకుంటారు.వినాయక చవితి రోజున విఘ్న వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే వారి ఇంట కష్టాలు రావని అనేవి రావనీ విశేషంగా నమ్ముతారు,విఘ్నేశ్వరుడికి సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇవ్వడమే అన్ని పండితులు చెబుతారు.విఘ్నేశ్వరుడు ప్రథమ ప్రథమ పూజలు అందుకునే ప్రకృతి దేవుడు. ప్రకృతి ఆరాధన పూజ అన్ని చెప్పవచ్చు.ప్రకృతిలో సృష్టి,స్థితి,లయ మూడు స్థితులు కనిపిస్తాయి.ఈ భూమి (సృష్టి) సూచించేందుకు మట్టి గణపతి,జీవాన్ని (స్థితి) సూచించేందుకు ప్రతీక,ఆకాశానికి (లయము) ప్రతీకగా పాలవెల్లిని ఉంచి పూజిస్తారు.అలాగే పాలవెల్లికి గడ్డి కట్టే పండ్లు గజముఖునికి ఇష్టమైనవిగా చెబుతారు.మరియు బ్రహ్మ, విష్ణు,మహేశ్వరాది దేవతా గణలా అందరికీ అక్కడ విఘ్నేశ్వరుడు ప్రభువు.లంబోదరుని పూజించడానికి ధనిక,పేద అనే తేడా ఉండదు.అందుకే అందరూ సంతోషంగా సాంప్రదాయబద్ధంగా విఘ్నాలు తొలగాలని గణపతిని కొలవడం హైందవ సాంప్రదాయం.