ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మద్య చిచ్చు

ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మద్య చిచ్చు

పుట్టపర్తి : ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాలను విడగొట్టి రిజర్వేషన్ కేటాయించడం సమంజసమైన ఆలోచనవిధానం కాదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మాల మహానాడు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కారాల వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ చేతన్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట “వర్గీకరణ వద్దు..రాజ్యాంగమే ముద్దు” జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై వెలువరించిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. తరతరాలుగా అన్నదమ్ములుగా ఉంటున్న ఎస్సీలను విడగొట్టి కేవలం రాజకీయ లబ్ధికోసమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
ఈనెల 21న దళిత సంఘాలన్నీ కలిసి భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కావున భారత్ బంద్ లో ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులు మాల కులస్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు భారత్ బంద్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, ఈశ్వరయ్య, జిల్లా నాయకులు చెరుకూరి గంగులయ్య, లక్ష్మీనారాయణ ,మనోహర్ మాల , ఇల్లూరి ఆంజనేయులు, టిసి. గంగాధర్, నాగేంద్ర ,వెంకటరాముడు, వేణుగోపాల్ ,హనుమంతు,అబ్రహం, సురేష్ ,జయచంద్ర ,పుష్పరాజ్ ,మహేష్ ,నరసింహులు ,మహిళా నాయకురాలు గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!