ఏడు బిల్లులకు శాసనసభ  ఆమోదం

ఏడు బిల్లులకు శాసనసభ ఆమోదం

 అమరావతి, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు బిల్లులకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. విరామం అనంతరం ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టేందుకు స్పీకరు స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ మంత్రి పి నారాయణ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లుకు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల రెండవ సవరణ బిల్లకు ఆమోదం లభించింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టిన విద్యుత్ సుంకం (సవరణ) బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ తరపున మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, దేవాదాయ సవరణ బిల్లు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిదాలయ సవరణ బిల్లులను సభ ఆమోదించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ అలోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల రిజిస్ట్రీకరణ — క్రమబద్దీకరణ సరవణ బిల్లుకు సభ ఆమోదం లభించింది. బిల్లు ఆవశ్యకతను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సభ్యులకు వివరిస్తూ..

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS