
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అమరావతి; ఏపీ లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవి కాలం ఈ నెల 29 తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్నికల కోడ్ అమలులోకి
నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటి సెక్రటరీ ఆర్ వనితా రాణిని ఎన్నికల కమిషన్ నియమించింది. మరో ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియామించింది. సోమవారం నుంచే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.