
ఒంటిమిట్టలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
వెలుగు న్యూస్ ఒంటిమిట్ట.03 : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవారి శాలలో గురువారం నుంచి 13వ తేదీ వరకు పది రోజులపాటు మండల పురోహితులు, అమ్మవారి శాల అర్చకులు ఏలేశ్వరం. గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో నిర్వాహకులు శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముందుగా అమ్మవారి ఆలయాన్ని నిర్వాహకులు మామిడి తోరణాలతో, అరటి పిలకలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అర్చకులు గురు స్వామి శర్మ ఆధ్వర్యంలో అదనపు అర్చకులు రామావజుల. శ్రీకాంత్ శర్మ, ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ, ఏలేశ్వరం. గురు దీక్షిత్ శర్మ, పురాణం .జయేంద్ర శర్మ కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా మహాగణపతి పూజ, ఆలయ స్వస్తి పుణ్యావాచనము, పంచపాలక ,అష్టదిక్పాలక, నవగ్రహ, అమ్మవారి ప్రధాన కలిశ మంటపారాధన, రిత్వికరణము, కంకణ ధారణ, అమ్మవారి మూల,ఉత్సవ వరులకు పురుష సూక్త, లక్ష్మీ సూక్త ప్రకారంగా శాస్ట్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రధారణ, కనక భూషణ పుష్పతరువులతో ప్రత్యేక అలంకరణ, సహస్రనామార్చన, ఉభయ దారుల ఆధ్వర్యంలో అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి మహా నివేదన,మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి శాల అధ్యక్షుడు సోమిశెట్టి. మనోహర్ బాబు పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఒంటిమిట్ట అమ్మవారి శాలలో మండల ప్రజల, ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో పది రోజులపాటు నవరాత్రులను భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నట్లు కావున యావన్మంది పూజా కార్యక్రమాల్లో పాల్గొని నవరాత్రులను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. అనంతరం మొదటి రోజు సాయంత్రం శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దీక్షాబంధన అలంకారంలో ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది.
.