ఓ యువతా!

ఓ యువతా!

ఓ యువతా! నీ చేతల్లో నీ భవిత.

స్వచ్ఛత లేని ప్రేమలు
సఖ్యత లేని స్నేహాలు
బాధ్యత లేని బంధాలు
నమ్మక ద్రోహులతో అనుబంధాలు
ఇబ్బంది పెట్టే ఈ బంధాలకు నీవు బందీవా? … అందుకే ॥ ఓ యువత//
ఒక వ్యక్తికి బానిసై
అందరి దృష్టిలో అలుసై
పలకరింపు కరువై
ఆప్యాయతకు దూరమై
ఎన్నాళ్ళని బతుకు తావు?… అందుకే //ఓ యువతా!|
తల్లిదండ్రుల ప్రేమ మరచి
పరుల ప్రేమకు పరవశించి
ఉన్న బంధాలను దూరముంచి
అశాశ్వతమైన వాటిని అతిగా ఆశించి
నిన్ను నీవు కోల్పోతావా?.. అందుకే ||ఓ యువతా!
కార్య దీక్షకు కంకణం కట్టి
కన్న వారికి ఆధారమై
నమ్మిన వారికి నమ్మకస్తుడై
వరించిన వారికి వారధియై
నీ జీవితాన్ని నీవే తీర్చి దిద్దుకో… అందుకే //ఓ యువతా|

✍….దుంపాల వీరేష

Author

Was this helpful?

Thanks for your feedback!