కడుపునొప్పి తాళలేక వస్మాల్ తాగి మహిళ ఆత్మహత్య

కడుపునొప్పి తాళలేక వస్మాల్ తాగి మహిళ ఆత్మహత్య

తుగ్గలి ,న్యూస్ వెలుగు:కడుపునొప్పి తాళలేక వస్మాల్ తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్సై మల్లికార్జున తెలియజేశారు. వివరాలలోకి వెళ్ళగా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గల ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన పి.కృష్ణవేణి (47) వైఫ్ ఆఫ్ రామచంద్ర అను ఆమెకు గత రెండు సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని,కుటుంబ సభ్యులు వివిధ హాస్పిటల్స్ నందు చూపించిన తగ్గకపోవడంతో నిన్నటి దినం ఉదయం 6 గంటల సమయంలో చనిపోవాలని క్షణికావేశంలో వస్మాల్ తాగగా గమనించిన కుటుంబ సభ్యులు గుత్తి ప్రభుత్వ హాస్పిటల్ కు అక్కడి నుండి కర్నూలు కు తరలించగా అప్పటికే కృష్ణవేణి మృతి చెందింది.పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి సొంత తమ్ముడు జయరాముడు పిర్యాదు మేరకు జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలియజేశారు. చనిపోయిన మహిళకు సంతానం లేదని జొన్నగిరి ఎస్సై మల్లికార్జున తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!