
కన్నుల పండుగగా నబీషా ఖాద్రి స్వామి గందోత్సవం
వందలాదిమంది భక్తులకు అన్నదానం ..
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ;జమ్మలమడుగు పట్టణంలోని పెన్నానది ఒడ్డున కొలువై గత 237 సంవత్సరాల నుంచి భక్తి తో కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గా విరాజిల్లుతున్న హజరత్ సయ్యద్ షా నబీషా ఖాద్రి స్వామి గందోత్సవం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. బుధవారం ముస్లింల కడ బుధవారం సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదు పీఠాధిపతులు సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి, సయ్యద్ షా నూరుల్లా పాషా ఖాద్రి, సయ్యద్ షా ఖాద్రి, సయ్యద్ షా అహ్మద్ పాషా ఖాద్రిల ఆధ్వర్యంలో జామియమసీదు కమిటీ సభ్యులు, వందలాది మంది ముస్లిం సోదర సోదరీమణులు పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న నబీష ఖాద్రి స్వామివారికి పవిత్ర గందోత్సవాన్ని జామియా మసీదు నుంచి ఫకీర్ల మేళ తాళాలు, స్వామివారి కీర్తన లతో తీసుకువెళ్లి స్వామి వారి దర్గా వద్ద గొప్పగా ఫకీర్ల మేల నిర్వహించి ప్రత్యేక ఫాతిహా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి సలాం పటించి స్వామివారి పవిత్ర మజారుకు ఖరీదైన చాదర్లు, పూల గిలాఫు లతో అలంకరించి పవిత్ర గంధోత్సవం నిర్వహించారు. అనంతరం గురువులు స్వామి వారిపై ప్రత్యేక సలాం పట్టించి కార్యక్రమానికి హాజరైన భక్తాదులు అందరికీ ప్రసాదం (మటన్ బిర్యానీ) పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి ప్రసాదం స్వీకరించారు.ఈకార్యక్రమంలో గురువులు సయ్యద్ జుబేర్ పాషా ఖాద్రి, మోసిన్ పాషా ఖాద్రీ, ఆసిఫ్ పాషా ఖాద్రి, యాసీన్ పాషా ఖాద్రి, కాజీం భాషా ఖాద్రి, ఆతిఫ్ పాషా ఖాద్రీ, జాహిద్ పాషా ఖాద్రీ, వారి కుటుంబీకులుముస్లిం సోదరసోదరీమణులు, చిన్నారులు వందలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.