
కలిసికట్టుగా హనుమాన్ జయంతి వేడుకలు : సబ్ కలెక్టర్
న్యూస్ వెలుగు హొళగుంద : ఈ నెల 12వ తేదీన జరిగే హనుమాన్ జయంతి (హనుమాన్ శోభ యాత్రను) వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు అన్ని సామాజిక వర్గాల ప్రజలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసికట్టుగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.అలాగే హోళగుంద మండలం రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతం మరియు వెనుకబడిన మండలం దీంతో ప్రజలందరూ తమ తమ పిల్లలను మంచి విద్యావంతులను చేసి ఉద్యోగం,వ్యవహార రంగాల్లో మండలాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ముఖ్యంగా ఒకరి పై ఒకరు అసూయ పడకుండా సోదరభావంతో మెలగాలని తెలియజేశారు.అనంతరం డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ హనుమాన్ శోభా యాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని మరియు శోభ యాత్రలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ రవిశంకర్ రెడ్డి,తహసీల్దార్ నిజాముద్దీన్,ఎంపిడిఓ విజయలలిత,ఎస్ఐ దిలీప్ కుమార్,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,గ్రామ పెద్దలు రాజా పంపన్న గౌడ,టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,ఎంపిపి తనయుడు ఈసా,డిఎస్ భాష,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.