
కాంగ్రెస్ నేత హత్య భద్రతా వైఫల్యమే : మాజీ మంత్రి
కర్నూలు న్యూస్ వెలుగు : ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిప్పగిరి లక్ష్మీ నారాయణ ని హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు యన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. రఘువీరా రెడ్డి కర్నూలు మరియు అనంతపురం జిల్లా ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి, చిప్పగిరి లక్ష్మీ నారాయణ హత్యకు కారకులైన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూని సంతాపాన్ని తెలియజేసారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత, దళిత నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని శాంతి భద్రతల వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనీ లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా వుంటుందని హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.