కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులపై రగడ
అధికారుల తీరుపై సర్కారు సీరియస్
అమరావతి,న్యూస్ వెలుగు : కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులపై వివాదం పెరుగుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలుగుదేశం అనుకూల కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఫిర్యాదు చేశారు. 2014-19 సంవత్సరాల మధ్య తాము చేసిన పనులకు వైసిపి ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిన విషయాన్ని వారు బాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో అనేక మంది న్యాయస్థానాలను కూడా ఆశ్రయిరచారు. అయినప్పటికీ చాలామందికి బిల్లులు రాలేదని తెలిసిరది. ఇప్పుడు తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాగా, 2019 కన్నా మురదు పనులకు బిల్లులు వస్తాయని వారు ఆశలు పెరచుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆ బిల్లులు రాకపోవడం, 2019 నురచి 2024 మధ్య కాలంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకే బిల్లుల చెల్లిరపుల్లో పెద్దపీట వేస్తున్నారని పాత కాంట్రాక్టర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని వారు తీసుకువెళ్లారు. దీంతో ఈ బిల్లుల చెల్లిరపులకు కారణం ఎవరున్నారన్న దానిపై పయ్యావుల ఆరా తీస్తున్నట్లు తెలిసిరది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌తో కూడా ఆయన మాట్లాడినట్లు సమాచారం. కనీసం తన దృష్టికి రాకుండా బిల్లులు చెల్లించడం పట్ల ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులే ఈ బిల్లులు చెల్లిరచారా లేక సిఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న వారి హస్తం ఏమైనా ఉరదా అన్న కోణంలో ఆయన ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే బిల్లుల చెల్లింపు జరిగిఉంటాయని గతంలో ఆర్థికశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.