కాంప్లెక్స్ సమావేశాలను  అడ్డుకుంటాం 

కాంప్లెక్స్ సమావేశాలను  అడ్డుకుంటాం 

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఇంగలదహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం నందు ఇంగలదహల్,ఎం.డి.హళ్లి,పెద్దగోనెహాల్ సర్పంచ్లు,పాఠశాల విద్యాకమిటి చైర్మన్లు,గ్రామ పెద్దలు యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మా గ్రామ పాఠశాల కాంప్లెక్స్ ను యథావిధిగా కొనసాగించాలని అధికారులు అందరిని అన్ని విధాలుగా కోరిన పట్టించుకోకుండా శనివారం పాత మరియు నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలల సమావేశాలను నిర్వహిస్తున్నారు.మా యొక్క అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎంఈఓ మరియు ఉన్నత అధికారుల నిర్లక్ష్యంను నిరసిస్తూ రేపు జరిగే సమావేశాలకు ఉపాధ్యాయులను వెళ్ళనివ్వకుండా అడ్డుకుని తీరుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచ్లు ప్రమీదవతమ్మ,సుధాకర్,వెంకటరామిరెడ్డి,విద్యా కమిటీ చైర్మన్లు ఊరుకుంద,కొండయ్య,సునీత, యూత్ సభ్యులు శేఖర్,బోడి,రఫీ,రాజు,మహనంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!