
కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి

వారి కుటుంబ పోషణ కోసం జల దీక్ష లో ఉన్నారు.
ఆరు నెలలు గా అందని జీతాలు
కొత్త చెరువు ;న్యూస్ వెలుగు; సత్యసాయి జిల్లాలోనీ కొత్త చెరువు మండలంలో గత ఆరు నెలలుగా జీతాలు అందక సత్యసాయి మంచి నీటి పథకం లో పనిచేస్తున్న కార్మికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ మేము పని చేస్తున్నాము. మారుమూల గ్రామాల్లోని పంచాయతీ నీరు రాకపోయినా మా సత్యసాయి మంచి నీటిని అందిస్తున్నాము.అటువంటి మాకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వున్నారు. మేము అందరం కలిసి నిరసన కార్యక్రమాల చేపట్టము అందులో భాగంగా గురువారం జల దీక్ష చెపట్టము.. ఇప్పటికైనా మా కుటుంబ ఆర్థిక స్థితి గతులను అర్థం చేసుకోగలరని, మీడియాతో వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే రాము ,బాబా సాహెబ్,కే శ్రీనివాసులు,ఓబులేసు,లక్ష్మీనారాయణ, నాగేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist