కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా కార్యదర్శిగా వడ్డే చల్లా చిన్న వెంకటేశ్వర్లు

కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా కార్యదర్శిగా వడ్డే చల్లా చిన్న వెంకటేశ్వర్లు

నంద్యాల న్యూస్ వెలుగు :  జిల్లా బిజెపి కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా కార్యదర్శిగా వడ్డే చల్లా చిన్న వెంకటేశ్వర్లు ను నియమించారు. ఈ సందర్భంగా సోమవారం నంద్యాలలో బిజెపి కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిసి బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు కు నియామక పత్రం అందజేశారు. చల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని, రైతు సమస్యలపై పోరాడి, రైతు పథకాలపై అవగాహన చేస్తానని చల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సాయి దత్తు, చిరంజీవి రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చల్ల మధు, వడ్డే శంకర్, వడ్డే పల్లపు రాము, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS