జమ్మూ & కాశ్మీర్లో, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని జలూరా గుజ్జర్పతి, సోపోర్ ప్రాంతంలోని అడవుల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తీవ్ర గాయాలతో ఒక ఆర్మీ సైనికుడు మరణించాడు. ఆపరేషన్ కొనసాగుతూ నేటికి రెండో రోజుకు చేరుకుంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసి విస్తరించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సోపోర్‌లోని జలూరా గుజ్జరపతి ప్రాంతంలో ఆర్మీ మరియు జే అండ్ కె పోలీసుల సంయుక్త బలగాలు కార్డన్ లేయర్లను కఠినతరం చేశాయని వారు తెలిపారు.




 DESK TEAM
 DESK TEAM