కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కర్నూలు (న్యూస్ వెలుగు): అంతర్జాతీయ సహకార సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పశువుల అభివృద్ధి సంఘం సమావేశ భవనంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై మాట్లాడుతూ డీసీఎంఎస్ రైతులు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు. ఈ సంస్థ అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. చిన్నచిన్న సమస్యలను ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరింపజేస్తాను,” అన్నారు.

రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పించబడుతుందని ఎంపీ తెలిపారు.

డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గిట్టుబాటు ధరలు, ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంచారన్నారు. రైతులు ఈ సదుపాయాలను వినియోగించి ఉత్తమ పంటల ఉత్పత్తి సాధించాలి,” కోరారు.

సంఘ అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

సహకార అధికారి వెంకటకృష్ణ , “జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ సేవలు ప్రశంసనీయం” అని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో జిల్లా సహకార ఆడిట్ అధికారి చెన్నమ్మ , రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కే. రామకృష్ణ ,( డి ఎల్ సి ఓ) నాగారమణయ్య , జయకర్ , పుల్లయ్య , బిజినెస్ మేనేజర్ రాజేష్ కుమార్, సహకార పరపతి సంఘాల సీఈవో లు మరియు డీసీఎంఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.రు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS