క్రీడలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

క్రీడలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

కర్నూలు న్యూస్ వెలుగు :  క్రీడాకారులు కొత్తగా నిర్మించిన రాయల స్పోర్ట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కబర్థి పేర్కొన్నారు..
ఆదివారం మిలిటరీ కాలనీ సమీపంలో రాయల స్పోర్ట్స్ క ను జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కబర్థి, తెలంగాణ రాష్ట్రం లోని మేడ్చల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు..
ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి మాట్లాడుతూ రాయల స్పోర్ట్స్ ను కర్నూలు లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాయల స్పోర్ట్స్ ను రాయల్ గా నడిపించాలని, జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులు దీనిని సద్వినియోgsm చేసుకావాలన్నారు. క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రికెట్ ఆటలో బాగా రాణించి కర్నూలు జిల్లాకు మంచి పేరు తేవాలని జడ్జి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పై.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఈరోజు రాయల స్పోర్ట్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
క్రీడాకారులు ఈ స్టేడియం ను వినియోగించుకొని, మంచి నైపుణ్యం సాధించి, క్రికెట్లో రాణించాలన్నారు. ఈ కాంప్లెక్స్ , స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించి, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా తయారవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రక్కనే ఉన్న ఈ స్థలం దాదాపుగా ఐదు ఎకరాల 50 సెంట్లు భూమిని ఎంసి బీచ్పల్లి సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులు ,తెలంగాణ రాష్ట్రం లోని మేడ్చల్, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీదేవి ఈ స్థలాన్ని రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు, ఈ కాంప్లెక్స్ ను కర్నూలు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు..
ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఈ రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వలన క్రికెట్ క్రీడాకారులకు మంచి అవకాశం అని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రికెట్ గేమ్స్ నందు మంచి నైపుణ్యం సంపాదించుకోవాలని ఎస్పీ క్రీడాకారులకు సూచించారు.

ఉత్సాహంగా క్రికెట్ ఆడిన కలెక్టర్, ఎస్పీ

రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన అనంతరం, కలెక్టర్, ఎస్పీ క్రికెట్ ఆడారు. ఇరు జట్లకు నాయకత్వం వహించి ఉత్సాహంగా క్రికెట్ ఆడి యువతలో స్పూర్తి నింపారు.. క్రికెట్ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ ఆర్డిఓ సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు,డిఎస్ డివో భూపతి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, లాయర్లు, తదితరులు పాల్గొన్నారు

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS