ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్,న్యూస్ వెలుగు ; ఖైరతాబాద్ మహా గణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు
ఖైరతాబాద్ మహా గణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు దానం నాగేందర్ శ్రీరాముడి విగ్రహాన్ని అందజేశారు.రతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి వారికి రెండు వైపుల అయోధ్య శ్రీబలరాముడు, రాహు, కేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను భక్తులకు కనువిందు చేస్తున్నారు. నవరాత్రోత్సవాలకు ఉత్సవ కమిటీతో పాటు పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ సకల ఏర్పాట్లు కల్పించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.