గజ్జెహళ్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు 

గజ్జెహళ్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు 

హొళగుంద,న్యూస్ వెలుగు;  భారత జాతి ముద్దుబిడ్డ, వీరత్వం,పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని స్థానిక మండలం పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. చాకలి రామలింగ మాట్లాడుతూ…. భారతదేశ చరిత్రలో గొప్పయోదులు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంత ప్రత్యేకత ఉంది. మహారాజ్ ఫిబ్రవరి 19,1630న శివనేరి కొండ కోటలో జన్మించాడు. ప్రముఖ మరాఠాయోధుడు, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు,ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది అన్నారు. గొర్రెల చిన్న శేఖర్ మాట్లాడుతూ…. చిన్నతనంలోనే మొఘలులు దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ చత్రపతి మహారాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంత వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మహరాఠా మహారాజుశివాజీకి దక్కుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు.అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశవ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ చాకలి రామలింగ, గొర్రెల చిన్న శేఖర్, కొత్తింటి బీమేష్,స్కూల్ చైర్మన్ శేషప్ప, మహదేవ్, రంగప్ప, ఏరస్వామి, శివమాల ధరించిన శివ స్వాములు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!