గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వీరుపాక్షి

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వీరుపాక్షి

ఆలూరు,న్యూస్:పట్టణంలోని హత్తిబెళగల్ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన బాల,బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహాలను సోమవారం ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం హాస్టల్ లో నెలకొన్న సమస్యలు స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీరుపాక్షి విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని,మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా తనకే ఫోన్ చేయొచ్చు అని విద్యార్థులకు ఫోన్ నెంబర్ ఇచ్చారు.తదనంతరం కమ్మటి వర్కర్స్ ఏళ్ల తరబడి ఇక్కడే వంట మనుష్యులుగా డైలీ వేజస్ విధానంలో చాలి చాలని వేతనాలతో పని చేస్తున్నామని 10 నెలలకు ఒక్క సారి వేతనాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తమను అప్కాస్ విధానంలోకి మార్పు చేసి న్యాయం చేయాలని వినంతి పత్రం అందజేశారు.

స్పందించిన ఎమ్మెల్యే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం కో కన్వినర్ వీరేష్, వైసిపి నాయకులు నాగేంద్ర,దేవ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!