
గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
తిరుపతి న్యూస్ వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టిడ్కో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ముక్కర అంబిక అనే లబ్ధిదారు సొంతింటి వేడుకలో స్వయంగా పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కొలుసు పార్థసారధి, శ్రీ పీ నారాయణ, శ్రీ అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీమతి విజయశ్రీ, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

