గ్రామసభతోనే అభివృద్ది :ఎంపీడీవో

గ్రామసభతోనే అభివృద్ది :ఎంపీడీవో

ఆలూరు న్యూస్ వెలుగు : హోళగుంద మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల్లో శుక్రవారం ఆయా గ్రామ సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ సభ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే సారి గ్రామ సభలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సీసీ రోడ్డు,డ్రైనేజీ,బిటి రోడ్డు నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.అలాగే కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు.అంతేకాకుండా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ సభలు ఎంతో దోహద పడతాయన్నారు.మరియు గ్రామాభివృద్ది కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయితీలో జరిగిన గ్రామ సభకు డీఎల్డిఓ నాగేశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ ఓబులమ్మ,ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,గ్రామ పెద్దలు రాజా పంపన్న గౌడ,వార్డు సభ్యులు సుబాన్,హమీద్,అబ్దుల్ రెహిమాన్,లింగమ్మ,చిన్న మల్లయ్య, నాయకులు  ఈసా,నాయకులు  హానుమప్ప,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి,టీడీపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,  చిన్నహేట శేషగిరి ,
జనసేన కన్వీనర్ అశోక్,కూటమి నాయకులు మురళీ ధర్,కాడప్ప,ఎర్రి స్వామి,దీడ్డి వెంకటేష్,ఆదాం,దుర్గ ప్రసాద్, మోహిన్,అంగన్వాడీ కార్యకర్తలు,ఆశ వర్కర్లు,వెలుగు సిబ్బంది,సచివాలయం సిబ్బంది,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!