
గ్రామ సభలతో సమస్యల పరిష్కారం
న్యూస్ వెలుగు: కర్నూలు కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో గ్రామసభనిర్వహించారు.పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం.
ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహణ అత్యంత కీలకమని, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం జరుగుతుందని గ్రామ టిడిపి నాయకుడు బి వి జి మస్తాన్ అన్నారు. గ్రామంలో ఉన్న అన్ని రకాల సమస్యలను గ్రామసభల ద్వారా గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు, రైతుల పొలాలకు వెళ్లే రోడ్లకు గ్రావెల్ వేసుకోవడం, బ్రిడ్జిల నిర్మాణం, ఉపాధి హామీ పథకంలో ఉన్న పనుల ద్వారా, వ్యవసాయ అనుబంధ పనులు, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, వ్యక్తిగత లబ్ధినిచ్చే పనులు, గ్రామంలోని ఒకటో సర్వే నెంబర్ లో ఉన్న కొండ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటించాలని, గ్రామంలో ఉన్న హిందూ, ముస్లిం స్మశాన వాటిక లకు ప్రహరీ గోడలు బోరుపాయింట్, ఒక రూమ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామసభల ద్వారా గ్రామ ప్రజలుఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీ, గ్రామ విఆర్ఓ, గ్రామ సచివాల సిబ్బంది టిడిపి నాయకులు నెరవాటి విజయకుమార్, లక్ష్మన్న, వెంకటరమణ, మధు, ప్రసాద్ గౌడ్, జానకి రాముడు, జనసేన నాయకులు శివ నాయుడు, బీవీజీ సతీష్ కుమార్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.