ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

హొళగుంద,న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2006 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఆనాటి హిందీ పండిట్ అయిన రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పెద్దహ్యట మల్లయ్య,సుదర్శన్ శెట్టి,వేణు,చిన్న మల్లయ్య,సాయిబేష్ మాట్లాడుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైనటువంటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో నిబద్ధతో ఎంతో వాస్తల్యంతో ఆనాడు మాకు పాటలు బోధించినటువంటి గురువులందరికీ ధన్యవాదాలు తెలిపారు.దేశ ప్రధాని అయిన రాష్ట్రపతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఒకనాడు గురువు దగ్గర విద్యార్థి కాబట్టి దేశం ఉన్నతంగా ఎదగాలంటే గురువు అనే వ్యక్తి చాలా ముఖ్యం.అలాంటి గురువులను గౌరవించడం మన బాధ్యత.ఆ అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నామన్నారు.అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురువు గురువృత్తి చాలా పవిత్రమైనది శిష్య బృందం అనేది ఎనలేని సంపదగా భావిస్తున్నాను.సొంత పిల్లలు వల్లే విద్యార్థుల ఎదుగుదలని ఎక్కువగా కోరుకుంటారని చెప్పారు.ఎక్కడికి వెళ్లినా పలకరించే విద్యార్థి సంపద మాకు దక్కడం మాకు చాలా సంతోషంగా భావిస్తామన్నారు.విద్యార్థులు ఎదుగుదలే తమ ఎదుగుదలగా భావించే గురువుగా నేను సంతోషపడుతున్నానని తెలియజేశారు.అంతేకాకుండా మండలంలోని హెబ్బటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయాలజీకల్ సైన్స్ ఉపాధ్యాయురాలు సయ్యద్ అత్సర్ ఉన్నిస ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నట్లు ఎంఈఓలు సత్యనారాయణ,జగన్నాథ్ పాత్రికేయులకు తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు,కృష్ణ,గాది,రామ్ రెడ్డి,మంజు,సత్య, సిద్దిలింగ, ఎస్ఎఫ్ఐ నాగరాజు,వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!