ఘనంగా గణపతి ఉత్సవాలు
గుంటూరు, న్యూస్ వెలుగు; గుంటూరు కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఆవరణ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మూడవ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించి సోమవారం గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ జిల్లా టీ.బి లెప్రసీ గుంటూరు జిల్లా అధికారి డాక్టర్ లక్ష్మానాయక్, పాత గుంటూరు కాపు సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఐ లా శ్రీనివాస్ , యువజన నాయకులు కొత్తపేట యూసఫ్, సిటి జిమ్ పవన్,పత్తిపాడు నియోజకవర్గ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు నిశంకర నరేంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, సిటీ జిమ్ పవన్, జోషి, వంశి ఆర్గనైజర్, దాసరి విష్ణు, ధారావత్ శరత్, వంగివరపు చిన్ను, తులసి హన్ను తదితరులు పాల్గొన్నారు.