
ఘనంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వేడుకలు

జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;జనసేన పార్టీ అధ్యక్షులు , తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పొన్నతోట జయచంద్ర, మునగాల ముని కృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడుగా ఎదిగిన క్రమం అభినందనీయమన్నారు ప్రజల కోసం రాజకీయ రంగంలో అడుగుపెట్టి ప్రజల అభ్యున్నతి కోసం చేస్తున్న ఈ ప్రజా పాలన ఆచరణీయమని చెప్పారు. ప్రజా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాల అదిరోహించాలని, ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే జమ్మలమడుగు పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సందడిగా చేయబోతున్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎక్కడ చూసినా పోస్టల్, బ్యానర్లతో, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist