పుట్టపర్తి 01 అక్టోబర్ న్యూస్ వెలుగు : పుట్టపర్తి మండల పరిధిలోని జగరాజు పల్లి గ్రామంలో పొలంబడి కి సంబందించి రైతు క్షేత్ర దినోత్సవం సిసిడి సంస్థ మంగళవారం నిర్వహించారు.

ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతుకు సహజ వ్యవసాయం పై అవగాహన కల్పించారు. గత 13 వారాలు గా వేరుశెనగ పంట పోలంబడి సమావేశాలు నిర్వహిస్తున్నామని,

సేంద్రియ ఎరువులు, కషాయాలు, వాడటం ద్వారా పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందనీ, ప్రత్యేక వేరుశనగ పంటలో పంట కోత ప్రయోగం చేసి ఆ పంటను రైతుల సమక్షంలో ఒక ఎకరాకు 22,250 రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిడి సిబ్బంది కే.వెంకటెసులు, రామంజనేయులు,రవి,
నారాయణ స్వామి, ప్రత్యుష,నారాయణ, రైతులు పాల్గోన్నారు.
Thanks for your feedback!