
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి
హొళగుంద,న్యూస్,వెలుగు:మండల కేంద్రంలో సోమవారం ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి ఆదేశాల మేరకు ప్రియతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే ఎంతో మంది నిరుపేదలకు 108,ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో పథకలను అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ షఫియుల్లా,ఎంపీపీ తనయుడు ఈసా,జిల్లా వైస్ చైర్మన్ బావ శేషప్ప,వైస్ ఎంపీపీ హనుమప్ప,ఎంపీటీసీలు మల్లికార్జున, కేంచప్ప,మల్లయ్య,షేక్షవలి,రమేష్,శివన్న,సర్పంచ్ తనయుడు పంపాపతి,మండల కో కన్వీనర్ రవి,నాయకులు యువనేత గిరి,కృష్ణ,మఠం మహేష్, రామతుల్లా,సోమిరెడ్డి,సిద్దప్ప, శేఖర్,ఈరన్న,భాష,దేవన్న,సవరప్ప,రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist