
ఘనంగా YSRCP ఆవిర్భావ వేడుకలు… జెండా ఆవిష్కరణ చేసిన వైఎస్ జగన్
అమరావతి తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YSRCP (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ )పార్టీ ఆవిర్భావ వేడుకలను తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా YSRCP కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందన్నారు. 2011 లో పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఓడిదుకులను ఎదుర్కుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ప్రజల గుండెల్లో చిరస్థాయి గా ఉండేలా అనేక పథకాలను అమలు చేసిన దేశంలోని ఎ కైక పార్టీ YSRCP అని వారు కొనియాడారు. ప్రజల తరుపున ముందుండి పోరాటం చేయడానికి ఎలాంటి సంకోచం లేదని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే కాలంలో మల్లి పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బచ్చ సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.