
జిల్లా కారాగారంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
కర్నూల్ న్యూస్ వెలుగు : కర్నూల్ మండలం పంచలింగాల గ్రామ సమీపంలోని జిల్లా కారాగారంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఖైదీల సంక్షేమ దినోత్సవం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, సదరన్ రీజియన్ హోమ్ గార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, జిల్లా కారాగారం సూపర్డెంట్ వేణుగోపాల్ రెడ్డి, జిజిహెచ్ సూపర్డెంట్ కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!