శ్రీలక్ష్మి హైస్కూల్ లో మొదలైన పినాక ఉచిత శిక్షణ తరగతులు

శ్రీలక్ష్మి హైస్కూల్ లో మొదలైన పినాక ఉచిత శిక్షణ తరగతులు

రాయలసీమ రవికుమార్.. కోర్స్ డైరెక్టర్,రాష్ట్ర అధ్యక్షులు, ఆర్వీపీఎస్
కర్నూలు, న్యూస్ వెలుగు : నగరంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్దగల శ్రీలక్ష్మీ హైస్కూల్ లో పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి,అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూప్స్, సివిల్స్ గైడెన్స్ కోర్సు ప్రారంభించామని పినాక కోర్స్ డైరెక్టర్ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా కర్నూలులో ఇంటర్ ,డిగ్రీ,బి.టెక్,పీజీ,వివిధ కోర్సులు చదువుతున్న మరియు పూర్తిచేసిన విద్యార్థులకు పినాక ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదువందల మంది విద్యార్థులు పినాక నుండి శిక్షణ పోందారని కొందరు మంచి ఉద్యోగాలలో ఉన్నారని అన్నారు.కర్నూలులో 21రోజులపాటు జరిగే శిక్షణ తరగతులకు ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి స్వయంగా కొన్నిరోజులపాటు పాల్గొని విద్యార్థులకు శిక్షణ ఇస్తారని అలాగే చెన్నైకు చెందిన రాజారాం కొల్లే వ్యక్తిత్వ వికాసం, ఇంటర్వ్యూ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయన్నారు పినాక రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో పదికేంద్రాలలో శిక్షణ అందిస్తుందని విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు మధ్యాహ్న భోజన వసతి, దూరప్రాంతాల విద్యార్థినిలకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నామని అడ్మీషన్లు కోసం కోర్స్ డైరెక్టర్ సెల్:-9177764147,9640969891 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పినాక అధ్యాపకులు సునితా రోజ్,స్వర్ణ సంజన్న,చంద్రశేఖర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!