పీహెచ్‌సీలో నేడు మొబైల్ ఎక్స్ రే హ్యాండ్ సెట్ ఏర్పాటు

పీహెచ్‌సీలో నేడు మొబైల్ ఎక్స్ రే హ్యాండ్ సెట్ ఏర్పాటు

నంద్యాల, న్యూస్  వెలుగు : బండి ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు శుక్రవారం మొబైల్ ఎక్స్ రే హ్యాండ్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మండల వైద్యులు డాక్టర్ ఆర్.సవిత, డాక్టర్ భావన తెలిపారు.  మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, గళ్ళతో పాటు రక్తం పడడం వంటి లక్షణాలు ఉంటే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి ప్రాథమిక టెస్టులు చేయించు కోవాలన్నారు. ఉచితంగా ఎక్స్రే తీయడం జరుగుతుందని తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS