రాతన గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించిన ఏపీవో రామకృష్ణ యాదవ్

తుగ్గలి, జూలై 9 ( వెలుగు న్యూస్ ) : తుగ్గలి మండలం రాతన గ్రామంలో వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీ-రామ్) ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో రామకృష్ణ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వద్ద మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించి, కార్మికుల హాజరు వివరాలను పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని కార్మికులకు సూచించారు. అలాగే అర్హులైన కార్మికులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 125 పనిదినాలను పూర్తిగా వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శాంతరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS