పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కోతికొండ బోయ వెంకటేష్
తుగ్గలి జులై 8 ( వెలుగు న్యూస్ ): తుగ్గలి మండలం కోతికొండ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కోతికొండ బోయ వెంకటేష్, బుధవారం పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో బోయ వెంకటేష్ మాట్లాడుతూ, జగన్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని, ప్రజల్లో పార్టీ స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి మరియు స్థానిక రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అనంతరం, కోతికొండ వెంకటేష్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు.

