ప్రభుత్వ భూముల ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

ప్రభుత్వ భూముల ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

పత్తికొండ( న్యూస్ వెలుగు ) జూన్ 12:  అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం తుగ్గలి కేంద్రంగా జరిగిన పి జి ఆర్ ఎస్ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. గత రెండు వారాలకు పైగా పత్తికొండ మండలం పత్తికొండ గ్రామం పత్తికొండ రెవెన్యూ కి సంబంధించిన 203 సర్వే నంబరుకు గల స్థల వివాదం పై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పత్తికొండ ఆర్డీవో మరియ రెవెన్యూ అధికారులను వివరణ కోరినట్లు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఎవరు ఆక్రమించినా సహించబోమని కలెక్టర్ ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు దీనిపై పూర్తి విచారణ చేసి నివేదికను అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రామకొండ వెంకటేశ్వర్లు, జాతీయ ప్రధాన కార్యదర్శి పులికొండ, జిల్లా నాయకులు కంప నరసింహులు, తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS